ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాకు కరోనా పాజిటివ్..!

Tuesday, July 7th, 2020, 02:21:58 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. రోజుకు వెయ్యికి చేరువలో కేసులు నమోదవుతున్నాయి అయితే ఇటీవల చాలా మంది రాజకీయ నేతలు కూడా కరోనా బారిన పడుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

అయితే సీఎం జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులకు‌, పార్టీ ముఖ్య నేతలకు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఆయన గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు.