ఏపీ డిప్యూటీ సీఎం భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్..!

Sunday, June 28th, 2020, 01:39:00 AM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి భద్రతా సిబ్బందిలో కూడా ఇద్దరికి కరోనా సోకింది. పుత్తూరు‌లోని నారాయణస్వామి నివాసం వద్ద ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు పహారా కాస్తుంటారు.

అయితే చిత్తూరు, తిరుపతి రెడ్‌జోన్‌ల నుంచి విధులకు రావటంతో అనుమానం వచ్చి వారిద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో నారాయణ స్వామి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.