ఏపీ డీజీపీ కీలకమైన ప్రకటన : ఇక నుండి రాకపోకలకు ఎలాంటి అవసరం లేదు…

Saturday, May 23rd, 2020, 02:53:51 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు దారుణంగా తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాకపోకలకు మరింత స్వేచ్ఛ కల్పించనున్నారు పోలీసు అధికారులు… కాగా ఇకనుండి రాష్ట్రంలో రాకపోకలకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. కాగా రాష్ట్రంలో ఒక జిల్లాలోకి వెళ్ళడానికి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అనుమతి అవసరం లేదని వెల్లడించారు. అంతేకాకుండా జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపవద్దని ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. కానీ ప్రభుత్వ నిబంధనలను తప్పకుండ పాటించాలని ఆయన వెల్లడించారు.

కాగా రాష్ట్రంలో మహమ్మారి కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 కొత్త కేసులు రావడంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అందరు కూడా రాష్ట్ర ప్రజలందరికి కూడా మరింత జాగ్రత్తలు చెబుతూ, మరిన్ని హెచ్చరికలు చేస్తున్నారు.