ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీల నియంత్రణకు కమిటీ – మంత్రి బుగ్గన

Thursday, April 22nd, 2021, 07:34:08 AM IST

కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో విలయ తాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యం లో ప్రైవేట్ ఆస్పత్రులు బాధితుల నుండి అధిక మొత్తం లో వసూలు చేయడం సరైన పద్దతి కాదు అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ మహమ్మారి ను ఎదుర్కొనేందుకు కర్నూలు జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.

గత ఏడాది కరోనా వైరస్ మహమ్మారి ను సమర్థంగా నియంత్రించి జిల్లాగా కర్నూలు నిలిచింది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. అంతేకాక ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీల నియంత్రణకు ఒక కమిటీ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అయితే ప్రభుత్వం యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా అధిక చార్జీల ను వసూలు చేస్తున్నట్లు సమాచారం వస్తే ఈ కమిటీ వెంటనే స్పందించి సంబంధిత ఆసుపత్రి పై చర్యలు తీసుకుంటుంది అని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉండటం తో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.