గత టీడీపీ ప్రభుత్వం అంచనాలు, లక్ష్యాలను ఎప్పుడూ అందుకోలేదు – ఏపీ ఆర్ధిక మంత్రి

Wednesday, July 15th, 2020, 03:05:09 AM IST


టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు వైసీపీ నేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఏనాడు కూడా అంచనాలను, లక్షాలను అందుకోలేదు అని అన్నారు.టీడీపీ హయం లో రెండంకెల వృద్ది ఎక్కడా జరగలేదు అని తెలిపారు. అంతేకాక 2018-19 సంవత్సరానికి గాను ఎంతో ఆర్ధిక ప్రగతి సాధించి నట్లు వర్ల రామయ్య అనడం పట్ల విమర్శలు గుప్పించారు. యనమల చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవు అని అన్నారు.

అయితే గత ప్రభుత్వం కాంట్రాక్టర్ లకు దోచిపెట్టేలా అంచనాలు పెంచారు అని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని సరి చేసింది అని అన్నారు. ద్రవ్యోల్బణం లో కూడా యనమల తప్పుడు లెక్కలు చెప్పారు అని, బీసీ, ఎస్టీ, ఎస్సీ సంక్షేమ పథకాలను వైసీపీ కాల రాసింది అని అబద్ధాలు చెప్పారు అంటూ మండిపడ్డారు. టీడీపీ 5,600 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేయగా ఎడాది కి, అదే వైసీపీ 20,100 కోట్లు ఖర్చు చేసింది అని అన్నారు. అంతేకాక పెండింగ్ బకాయిల విషయం పై, ఫీజు రీయింబర్స్మెంట్, పేద ప్రజల ఇళ్ళ స్థలాలు కేటాయింపు వ్యవహారం పై ప్రశంసలు కురిపించారు. అంతేకాక కరోనా వైరస్ మహమ్మారి ఉన్న సమయం లో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని వెల్లడించారు.