బ్రేకింగ్: ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణకు మరో షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..!

Wednesday, October 16th, 2019, 10:30:04 PM IST

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, అవినీతిని నిర్మూలించే పనిలో జగన్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కూడా వెలికి తీస్తూ గతంలో జరిగిన తప్పులను పునారావృత్తం కాకుండా చూసుకుంటున్నాడు.

అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో కృష్ణా నది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడం ప్రజావేదికను కూడా నోటీసులు జారీ చేసి కూలగొట్టించాడు. అయితే తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణకు కూడా మరోసారి జగన్ షాక్ ఇచ్చింది. విశాఖలోని పరదేశిపాలెంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌కు చెందిన ఆమోదా పబ్లికేషన్ సంస్థకు గత ప్రభుత్వం కేటాయించిన ఎకరంన్నర భూమిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. నేడు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ భూమి విలువ సుమారు 40 కోట్ల రూపాయలు ఉంటుందని కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడింది.