బాధ్యతలు చేపట్టడం సరికాదు.. నిమ్మగడ్డకు ఏపీ సర్కార్ ఝలక్..!

Saturday, May 30th, 2020, 10:47:43 PM IST

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నిన్న తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమీషనర్ పదవీకాలాన్ని తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించినట్టు ప్రకటించుకున్నారు.

అయితే హైకోర్టు తీర్పు తర్వాత కమిషనర్‌గా రమేశ్ కుమార్ కొనసాగవచ్చని హైకోర్ట్ చెప్పలేదని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం తెలిపారు. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లేవరకు హైకోర్టు తీర్పును స్టే చేయాలని కోరినట్టు తెలిపారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ని నియమించే అధికారం రాష్ట్రానికి లేదంటే, నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుందని ఆయన అన్నారు. నిమ్మగడ్డను కూడా అప్పటి సీఎం చంద్రబాబు సలహా మేరకే నియమించారని గవర్నర్ నిర్ణయంలో మంత్రి మండలి సలహా అవసరం లేదంటే అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా కూడా చెల్లదని కామెంట్ చేశారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరిందని, ఈ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని ఏజీ శ్రీరామ్ చెప్పారు.