వైఎస్‌తో పాటు మరణించిన ఐఏఎస్‌ కుమార్తెకు కీలక పదవి కట్టబెట్టిన ఏపీ సర్కార్..!

Saturday, May 30th, 2020, 12:22:19 AM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న వైఎస్‌.రాజశేఖరరెడ్డి 2009, సెప్టెంబరు 2న రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలిక్టాపర్‌ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో వైఎస్ ముఖ్యకార్యదర్శి డాక్టర్ సుబ్రహ్మణ్యం కూడా మరణించారు.

అయితే 2017, మే 23న తన కుమార్తె సింధుకు ఉద్యోగం ఇవ్వాలంటూ సుబ్రహ్మణ్యం సతీమణి విజయకుమారి ప్రభుత్వాన్ని కోరారు. అయితే తాజాగా పి.సింధును డిఫ్యూటి కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. వాస్తవానికి 2017లోనే ఆమెకు ఈ ఉద్యోగం రావలసి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూనే వచ్చింది. అయితే డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటాలో ఆమెకు డిప్యూటీ కలెక్టర్‌ పోస్టు ఇవ్వగా, త్వరలోనే కృష్ణా జిల్లా డిప్యూటీ కలెక్టర్‌‌గా విధులు నిర్వహించబోతున్నారు.