ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…తెలంగాణ, కర్నాటక లు ఇక హై రిస్క్ ప్రాంతాలు!

Tuesday, July 14th, 2020, 03:00:01 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రోజూ నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల విషయం లో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయి, ఇతర రాష్ట్రాల, దేశాల నుండి వచ్చే వారికి క్వారంటైన్ లో కీలక మార్పులు చేసింది. అయితే అందులో భాగంగా తెలంగాణ మరియు కర్నాటక రాష్ట్రాలను హై రిస్క్ ప్రాంతాలుగా వర్గీకరిస్తూ పలు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే అక్కడ ఆయా రాష్ట్రాలలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం తో పాటుగా వ్యాప్తి కూడా ఎక్కువగా ఉండటం చేత వాటిని హై రిస్క్ ప్రాంతాలుగా పేర్కొన్నట్లు తెలిపారు.

అయితే ఇప్పటి వరకూ విదేశాల నుండి వచ్చే వారు ఇక 7 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. అంతేకాక అయిదు మరియు ఏడో రోజులలో వారికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిపెలా చర్యలు తీసుకుంది. విమానాశ్రయాల్లో స్వాబ్ టెస్టుల నిర్వహించెలా చర్యలు తీసుకోనీ, వారిని 14 రోజుల హోమ్ క్వారంటైన్ కి తరలించాలి. రైలు ప్రయాణం చేసే వారికి సైతం ఇదే తరహాలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ కి వచ్చే వారికి ఇక స్పందన ఈ పాస్ కచ్చితంగా ఉండాల్సిందే. అక్కడ పాజిటివ్ వచ్చినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.