వాక్సినేషన్ ప్రక్రియ లో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Wednesday, June 9th, 2021, 09:01:01 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే రాష్ట్రం లో కరోనా వైరస్ వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లోని ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు వాక్సిన్ వేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా వైరస్ థర్డ్ వేవ్ లో పిల్లల పై ప్రభావం చూపిస్తుంది. అయితే అందుచేత పిల్లల తల్లులకు వాక్సిన్ వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వాక్సినేషన్ ప్రక్రియ లో భాగం గా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.

గ్రామాల వారీగా జాబితా ను సిద్దం చేయడం జరుగుతోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కి సీఎం జగన్ ఆదేశాలు ఇవ్వడం తో ప్రక్రియ వేగవంతం అయినట్లు తెలుస్తోంది. అయితే అర్హులు అయిన తల్లులందరికి ఒక రోజు ముందుగానే ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లు టోకెన్ లను పంపిణీ చేయాలని తెలిపింది. అందులో తెలిపిన వివరాల మేరకు తేదీ, సమయం ప్రకారం వాక్సినేషన్ కేంద్రాలకు తరలించి వాక్సిన్ వేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 15 లక్షల నుండి 20 లక్షల మంది వరకు ఉండే అవకాశం ఉందని, వయసు తో సంబంధం లేకుండా వాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకుంది.