ఏ రోజైనా టీడీపీ పాలన లో ఇలా చేయగలిగారా?

Thursday, July 2nd, 2020, 07:30:44 AM IST

కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాల అమలు తో దూసుకెళ్తుంటే, టీడీపీ మాత్రం బురద జల్లుతుంది అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఎన్ని మంచి పనులు చేస్తున్నా స్వాగతించానికి వారికి మనసు ఒప్పదు అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి బెంజి సర్కిల్ వద్ద భారీగా 108,104 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అయితే సీఎం జగన్ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని జాతీయ మీడియా మెచ్చుకుంటుంటే, చంద్రబాబు కనీసం అభినందించలేనీ స్థితిలో ఉన్నారు అని వ్యాఖ్యానించారు.గత సర్కార్ అప్పులను, బకాయిలను తీరుస్తునే ప్రజలకు సహాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. ఆరు నెలల్లో 28,122 కోట్ల రూపాయల ను 3,53,02,377 ప్రజలకు అందజేశారు అని, ఇది గొప్ప విషయం కాదా, ఏ రోజైనా టీడీపీ పాలన లో ఇలా చేయ గలిగారా అని నిలదీశారు.

ఒక పక్క కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, టీడీపీ విమర్శలు చేస్తుంది అని, అచ్చెన్న వ్యవహారం నుండి దృష్టి మరల్చేందుకు అంబులెన్స్ లలో అవినీతి జరిగింది అని ఆరోపణలు చేస్తూ ఇష్టానుసారం గా మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.