పంచాయితీ ఆఫీసులకు ఆ రంగులు వేయండి.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

Saturday, June 27th, 2020, 08:58:08 PM IST


ఏపీలో పంచాయితీ కార్యాలయాల రంగుల విషయంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది వరకే ప్రభుత్వ, పంచాయితీ భవనాల రంగుల విషయంపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలకు 4 రంగులు సరికాదని, వాటిని తొలగించాలని ఆదేశిస్తూ నాలుగు వారాల పాటు గడువునిచ్చింది.

అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పంచాయతీ కార్యాలయలకు వెంటనే రంగులు మార్చాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే వేయాలని స్పష్టం చేసింది.