కరోనా నేపధ్యంలో ఇంటింటి సర్వే.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

Sunday, May 24th, 2020, 03:00:23 AM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 25వ తేదీ నుండి కరోనా వైరస్ పై ఇంటింటా సర్వే ద్వారా ప్రజలలో విస్తృత అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్దమౌతుంది.

అయితే దీనిపై సీఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కలిగించేందుకు రెండు కరపత్రాలను ప్రచురించామని తెలిపారు. ఎఎన్ఎం, ఆశావర్కర్, గ్రామ, వార్డు వాలంటీర్లతో కూడిన బృందం ఇంటింటీకీ వెళ్ళి ప్రజలలో అవగాహన కలిగించాలని చెప్పారు.