సీఎం జగన్ డిసీషన్.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్..!

Friday, June 26th, 2020, 10:14:57 PM IST

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను ఏడాదిపాటు పొడిగించింది.

అయితే ఈ పనిదినాలను వచ్చే ఏడాది వరకు పొడిగిస్తూ సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు. సచివాలయం ఉద్యోగులు, అన్ని శాఖల హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రకటించారు.