టీటీడీ భూముల అమ్మకాలను నిలిపివేసూ ఉత్తర్వులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

Monday, May 25th, 2020, 11:53:58 PM IST

టీటీడీ భూముల అమ్మకాల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల అమ్మకాల ప్రక్రియపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఆ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

అయితే 2016, జనవరి 30న టీటీడీ బోర్డు చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు గత పాలకమండలి నిర్ణయాన్ని నిలిపివేస్తూ జీవో నెంబర్‌ 888 విడుదల చేశారు. అయితే ఈ విషయంలో మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయాలు తీసుకోవాలని, ఆధ్యాత్మికవేత్తలు, ధర్మప్రచారకులతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వులో పేర్కొంటూ టీటీడీకి సూచించింది. అయితే ఈ సంప్రదింపులు పూర్తయ్యే వరకూ భూముల వేలం నిలిపివేయాలని నిర్ణయిస్తూ, దీనిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.