‘హీరో’తో ఏపీ ఒప్పందం

Tuesday, September 16th, 2014, 06:42:33 PM IST


ఆంధ్రప్రదేశ్ లో ‘హీరో’ పరిశ్రమను ఏర్పాటు చెయ్యడానికి ఏపీ సర్కారుకు, హీరో మోటార్స్ సంస్థకు మధ్య మంగళవారం మధ్యాహ్నం ఒప్పందం కుదిరింది. ఈ నేపధ్యంగా యూనిట్ స్థాపన కోసం చిత్తూరు జిల్లా శ్రీసిటీ సమీపంలో 600 ఎకరాల స్థలం కేటాయించారు. కాగా 18నెలల్లో హీరో మోటారు సైకిళ్ళు తయారీ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసేలా ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంపనీ ప్రతినిధి రాకేశ్ వసిష్ట్ తో ఒప్పందం చేసుకుంది. ఇక దీని ద్వారా పదివేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. కాగా వీలైనంత త్వరగా ప్లాంటు ఏర్పాటుకు సంస్థ ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘హీరో’ సంస్థ ప్రతినిధులను కోరారు.