చార్జీలు పెంచం!

Wednesday, September 17th, 2014, 06:29:19 PM IST


ఆంధ్రప్రదేశ్ మంత్రి సిద్ధా రాఘవరావు బుధవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీడ్ డ్రైవ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పెంచేందుకు చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు ముమ్మరం చేస్తామని మంత్రి సిద్ధా వివరించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ చార్జీల పెంపుపై ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు చెయ్యలేదని వివరించారు. అలాగే షీలాభిడే కమిటీ నివేదిక తర్వాతే ఆర్టీసీ విభజన జరుగుతుందని, విభజన పూర్తి కావడానికి మరో రెండు నెలలు పడుతుందని మంత్రి సిద్ధా పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు 2,300కోట్ల అప్పులున్నాయని సిద్ధా రాఘవరావు తెలిపారు.