ఫేక్ న్యూస్‌పై ఏపీ సర్కార్ సీరియస్.. ఇకపై జైలుకే..!

Wednesday, April 28th, 2021, 03:00:15 AM IST

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో తప్పుడు వార్తలను ప్రచురించడంపై ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది. కొంద‌రు ఫేక్‌గాళ్లు త‌ప్పుడు వార్త‌ల‌ను సృష్టించి ప్ర‌జ‌ల్లో మ‌రింత భ‌యాందోళ‌న‌లు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే తప్పుడు ప్రచారం చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు వెనుకాడేదిలేద‌ని, అస‌వ‌ర‌మైతే అరెస్ట్ చేసి జైలులో పెట్టాల‌ని అధికారుల‌ను సీఎం జగన్ ఆదేశించారు.

అయితే కోవిడ్ వ‌ల్ల ఇప్ప‌టికే అంద‌రూ భ‌య‌ప‌డుతున్నారు.. ఇలాంటి ప‌రిస్థితుల్లో లేనిపోని పుకార్లు సృష్టించి అస‌త్యాలు ప్ర‌చారం చేస్తే ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న ఇంకా తీవ్రం అవుతుంద‌ని కాబట్టి ఎస్పీలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. అస‌త్య ప్ర‌చారాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని, వాళ్ల‌ను జైలుకు పంనే అధికారం కూడా ఎస్పీల‌కు ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు అని గుర్తుచేశారు. ఈ విష‌యంలో అవ‌స‌రం అయితే అంద‌రూ ఎస్పీలు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం జగన్ అన్నారు.