జగన్ సత్తా ఏమిటో అక్కడే తెలియాలి..వారమే గడువు

Friday, August 16th, 2019, 07:35:20 AM IST

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ముఖ్యంగా పోలవరం విషయంలో జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు ఆయనకి ఒక సవాలుగా మారింది. పోలవరం పనులు చేస్తున్న నవయుగ సంస్థ టెండరును జగన్ రద్దు చేయటంతో అందరూ పోలవరం పనులు ఆగిపోయాయని అనుకుంటున్నారు. ప్రతిపక్షము దానిని హైలైట్ చేస్తూ జగన్ ని ఇరుగున పెట్టె పని చేస్తుంది.

దీనితో జగన్ వారంలోగా కొత్త టెండర్లను పిలవాలని నిన్నటి సమావేశంలో చెప్పుకొచ్చాడు. నవయుగ సంస్థని ఎందుకు తప్పించారయ్య అంటే గతంలో పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెపుతున్నారు జగన్ ప్రభుత్వ పెద్దలు. అందుకే నవయుగని తప్పించారు. అయితే నిజానికి గతంలో బాబు అంచనాలు పెంచి, రీటెండర్లు పిలిచినప్పుడు, పాత ధరలకే పనిచేస్తామని నవయుగ ముందుకి వచ్చింది.
అయిన కూడా దానిని రద్దు చేశాడు.

జగన్ ఇప్పుడు కొత్త టెండర్లును పిలిస్తే వాళ్ళు నవయుగ కంటే తక్కువగా కోడ్ చేయాలి, లేకపోతే జగన్ తీసుకున్న నిర్ణయం తప్పు అవుతుంది. పోలవరం అథారిటీ కూడా ఇదే చెప్పింది. కొత్త టెండర్లు వస్తే ధర పెరుగుతుంది, అది మేము భరించలేమని తేల్చి చెప్పింది. అది జగన్ కి ఊహించలేని షాక్. కాబట్టి కొత్త టెండర్లు నవయుగ కంటే తక్కువగా కోడ్ చేసి పనులు స్టార్ట్ చేయాలి. అప్పుడే జగన్ చేసిన పనికి మద్దతు లభిస్తుంది. ఆలా కాకుండా ఒక్క రూపాయి అయిన సరే పాత టెండరు కంటే ఎక్కువ అయితే మాత్రం జగన్ మీద ముప్పెట్ట దాడి జరిగే అవకాశం ఉంది. జగన్ మీద జనాలకి నమ్మకం కూడా పోతుంది.