నిమ్మగడ్డ కేసు స్టే పిటిషన్‌ను ఉపసంహరించుకున్న జగన్ సర్కార్..!

Wednesday, June 3rd, 2020, 03:00:53 AM IST


నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో హాట్‌టాఫిక్‌గా మారింది. నిమ్మగడ్డ కేసులో హైకోర్ట్ తీర్పును వ్యతిరేకించిన ఏపీ సర్కార్ సుప్రీం కోర్ట్‌కి వెళ్ళేందుకు సిద్దమయ్యింది. అయితే నిమ్మగడ్డ కేసు విషయంలో జగన్ సర్కార్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.

అయితే నిమ్మగడ్డ కేసులో హైకోర్టులో వేసిన స్టే పిటిషన్‌ను జగన్ సర్కారు దానిని ఉపసంహరించుకుంది. సుప్రీం కోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో స్టే పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. అంతేకాదు జస్టిస్ కనగరాజ్ తరఫున వేసిన స్టే పిటిషన్‌ను కూడా వెనక్కి తీసేసుకుంది.