బిగ్ న్యూస్: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ఏపి హైకోర్టు కీలక తీర్పు!

Sunday, May 24th, 2020, 09:00:27 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి చెలరేగుతున్న వేళ వేకువ జామున వైజాగ్ లో గత మూడు వారాల క్రితం జరిగిన ఘటన ప్రజలను ఒక్క సారిగా ఆందోళన కి గురి చేసింది. అయితే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన కి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం కీలక తీర్పు ను ప్రకటించింది. కంపెనీ నీ సీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ఎవరిని అనుమతించడానికి ఇక వీలు లేదని తెలిపింది. అయితే ఈ కంపెనీ కి సంబంధించిన డైరెక్టర్ లు ఎవరైతే ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్ళి పోవడానికి వీలు లేదు అని ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ కంపెనీ కి సంబంధించిన డైరెక్టర్లు తమ పాస్పోర్ట్ లని స్వాధీన పరచాలి అని తెలిపింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయ స్థానం లిఖిత పూర్వకంగా ఆదేశాలను జారీ చేసింది. అయితే స్థైరిన్ గ్యాస్ లీకేజీ అనంతరం ఆ స్టీరిన్ ను విదేశాల కు ఎవరి అనుమతి తో తరలించారు అని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు.అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. మరి దీని పై ఆ సంస్థ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.