పరీక్షలపై ప్రభుత్వం పునారాలోచించాలి.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

Friday, April 30th, 2021, 07:30:19 PM IST

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికి పది, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించి తీరుతామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పటికే ఇంటర్ పరీక్షల హాల్ టికెట్ల డౌన్ లోడ్ ప్రక్రియ ప్రారంభం కాగా, పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. అయితే తాజాగా ఏపీలో పరీక్షల నిర్వహణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించింది.

అయితే తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, ఇది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశామని హైకోర్టు పేర్కొంది. పక్క రాష్ట్రాలలో పరీక్షలు వాయిదా వేస్తే మీరు ఎలా నిర్వహిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 3కు హైకోర్టు వాయిదా వేసింది.