చంద్రబాబుకు షాకిచ్చిన ఏపీ హైకోర్ట్.. కారణం అదే..!

Thursday, May 28th, 2020, 12:25:54 AM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల తర్వాత చంద్రబాబు మొన్న సోమవారం ఏపీలోకి అడుగుపెట్టారు.

అయితే చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారని, జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్‌ తాతయ్య, తంగిరాల సౌమ్యలు పార్టీ జెండాలతో ర్యాలీగా వచ్చారని మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా తెలుగు తమ్ముళ్ళు వ్యవహరించిన తీరుపై బాద్యుడిగా చంద్రబాబుపై కేసు నమోదు చేయాలంటూ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

అయితే దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం చంద్రబాబు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించటంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారా, లేదా అని పిటిషనర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. గతంలో ఇలాంటి కేసులను నేరుగా హైకోర్టు నేరుగా విచారణకు స్వీకరించిందని పిటిషనర్‌ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. అయితే దీనిపై తదుపరి విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.