పల్నాడు విషయంలో సీరియస్ అవుతున్న హోంమంత్రి – ఎందుకంటే…?

Wednesday, September 11th, 2019, 02:04:12 AM IST

ఏపీలో ప్రస్తుతానికి వైసీపీ నేతలకు మరియు టీడీపీ నేతలకు మధ్యన మాటల యుద్ధం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా అయితే పల్నాడులో టీడీపీ నేతలు కొత్తరకమైన రచ్చ చేయాలనీ ప్రయత్నిస్తున్నారని, వారిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కూడా చాలా రకాల ఎత్తులు వేస్తున్నారని సమాచారం. కాగా బుధవారం నాడు టీడీపీనేతలి చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఆసందర్భంగా అక్కడ ఎవరైనా కూడా శాంతి భద్రతలకు ఇబ్బంది కల్పిస్తే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖా మంత్రి సుచరిత స్పష్టం చేశారు. కాగా ఈమేరకు వెలగపూడి సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశానికి హాజరైనటువంటి హోంమంత్రి మేకతోటి సుచరిత కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ఇకపోతే ప్రతి సోమవారం నాడు స్పందన కార్యక్రమం జరగుతోందని… ఈ సందర్భంగా వచ్చినటువంటి ఫిర్యాదులకు కేవలం15 రోజుల్లో పరిష్కారం చూపించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు చేశారని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు.

అంతేకాకుండా టీడీపీ నేతలు దాడుల పేరుతొ కుట్రపూరితమైన రాజకీయాలకు తెరతీస్తున్నారని, ఈమేరకు పల్నాడులో పెయిడ్‌ ఆర్టిస్టులతో కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారని , ఎవరైనా ఇలా ప్రజలకు విఘాతం కలిగించేలాగా ప్రవర్తిస్తే తప్పకుండ చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు హోంమంత్రి సుచరిత.