అక్రమ కేసులన్నీ ఎత్తివేసే బాధ్యత నాది – ఏపీ హోంమంత్రి హామీ

Thursday, November 21st, 2019, 02:40:13 AM IST

బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైనటువంటి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. కాగా గత టిడిపి ప్రభుత్వ హయాంలో ముస్లిం యువకులు, ప్రత్యేక ఉద్యమ కారులపై అక్రమంగా పెట్టినటువంటి అక్రమ కేసులన్నింటిపైనా సరైన విచారణ జరిపించి, వారిపై ఉన్నటువంటి అక్రమ కేసులన్నింటినీ కూడా ఎత్తేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత హామీ ఇచ్చారు. అంతేకాకుండ టీడీపీ ప్రభుత్వ హయాంలో అనవసరంగా చాలా మందిపైన అక్రమంగా రౌడీషీట్లు తెరిచి వేధించిందని ఆరోపించారు.

ఇకపోతే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు ఏర్పాటు చేసుకున్న సభలో, ప్రజలు కొందరు తన ఇబ్బందులు చెప్పుకోడానికి వచ్చి, చంద్రబాబు కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కారణంగా కొందరు ముస్లిం యువకులపై అక్రమంగా దేశ ద్రోహకేసులు పెట్టి, ఇప్పటికి వారిని వేధిస్తున్నారని వెల్లడించారు. కాగా ఈ విషయాన్ని సదరు ముస్లిం యువకులు తమ దృష్టికి తీసుకొచ్చారని, ఆ విచారణలో 9 మందిపై పెట్టిన కేసులు అక్రమమని తేలిందని వెల్లడించారు. ఇకపోతే వాటన్నింటిపైనా సరైన విచారణ జరిపించి త్వరలోనే కేసులు ఎత్తివేస్తామని మంత్రి సుచరిత వెల్లడించారు.