ఎక్కడ పడితే అక్కడ మద్యం .. చంద్రబాబు బంపర్ ఆఫర్

Sunday, November 13th, 2016, 01:03:43 PM IST

chandrababu
రాబోయే ఒక్క నెల డిసెంబర్ గడిచిపోతే అప్పుడే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది . ఆ కొత్త సంవత్సరం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని బంపర్ ఆఫర్ లు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ సామాన్యులకి కాదు రోజూ ఫుల్లుగా తాగేసే మందు బాబుల కోసం మాత్రామే సుమా. రాబోయే ఏడాది జనవరి లో మద్యం విక్రయాలు విరివిగా పెరిగేలా రాష్ట్రానికి మరింత ఆదాయం వచ్చేలా విప్లవాత్మక నిర్ణయాలు రాబోతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ఫుడ్ కోర్టులు.. రిసార్ట్స్ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చంద్రబాబు సర్కారు తాజాగా జీవో జారీ చేసింది. జీవో నెంబరు 470 ప్రకారం పుడ్ కోర్టల్లో.. రిసార్ట్స్ లలో బెవరేజస్ ను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. హోటల్స్ లో రిసార్ట్ లలో బీచ్ లలో కూడా మద్యం అమ్మకాలకి అంతా ఓకే చెప్పింది ప్రభుత్వం. ఆతిధ్య రంగానికి , పర్యాటక రంగానికీ మరింత చేరువగా ఉండాలి అని ఈ నిర్ణయం తీసుకున్నారట.