కొవిడ్ బాధితులకు 37 వేల పడకలు పెంచాం – ఆళ్ల నాని

Wednesday, April 28th, 2021, 06:09:18 PM IST

Alla-Nani

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఒక పక్క పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంటే, మరోక పక్క బాధితుల మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే రాష్ట్రంలోని కరోనా పరిస్థితుల పై, రోగులకు వైద్యం, ఆక్సిజన్ సరఫరా, రెం డెసివిర్ ఇంజెక్షన్ల కొరత, ఆసుపత్రుల్లో పడకల పెంపు తో పాటుగా సహాయ చర్యల పై మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన మంత్రులు మరియు అధికారులతో జరిగిన సమావేశం లో చర్చ జరిపారు. అయితే దీని పై పూర్తి స్థాయిలో చర్చ జరిపిన అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే కరోనా వైరస్ బాధితులు పూర్తిగా కోలుకునే వరకూ కూడా వారి బాధ్యత తమదే అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందించేందుకు అయినా సిద్దం అంటూ హామీ ఇచ్చారు. అయితే రోగుల సంఖ్య పెరుగుతూ ఉండటం తో ఆసుపత్రుల్లో పడకల కోసం డిమాండ్ పెరుగుతూనే ఉందని తెలిపారు. అయితే కోవిడ్ బాధితులకు 37 వేల పడకలు పెంచిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. అంతేకాక మరో 33 వేల కేంద్రాల్లో పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే కేంద్రాల్లో ఎక్కడా కూడా ఆక్సిజన్ కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రుల్లో రెం డెసివిర్ కొరత లేకుండా చూస్తున్నాం అని, ఈ ఇంజెక్షన్ సరఫరా మరియు వినియోగం లో అక్రమాలు జరగకుండా చూసేందుకు కమిటీ వేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఆళ్ల నాని చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.