ఆక్సీజన్ కొరత లేకుండా ముందస్తు చర్యలు – మంత్రి అవంతి శ్రీనివాస్

Thursday, May 13th, 2021, 03:47:57 PM IST


కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపథ్యం లో రోగులకు బెడ్ లేదు అనే సమాధానం లేకుండా వైద్యం అందిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అయితే జిల్లాలో 79 కోవిడ్ ఆసుపత్రుల్లో 5,700 మందికి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అయితే సిబ్బంది కొరత ఉంటే వెంటనే నియమించుకునే అధికారం జిల్లా అధికారులకు కల్పించినట్లు మంత్రి గుర్తు చేశారు. అయితే ఆక్సిజన్ కొరతే లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే 1,443 ఆరోగ్య శ్రీ పడకలు ఉండగా, వాటిని పెంచే యోచన లో ఉన్నట్లు తెలిపారు. అయితే హెల్త్ కేర్ వర్కర్స్, అందరికీ పిపి కిట్స్ మరియు ఎన్ 95 మాస్కులు అందిస్తున్నాం అని వ్యాఖ్యానించారు.

అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు, విమర్శలకు తావు లేకుండా సమిష్టి గా పని చేయాలని సూచించారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి దశల వారీగా వాక్సిన్ వస్తోంది అని, అందరికీ వాక్సిన్ వేయడం జరుగుతోంది అని వ్యాఖ్యానించారు.అయితే విశాఖ జిల్లాలో నీ 46 వేల మంది ఇటీవల కోవిడ్ తో చేరగా అందులో 26 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు అని తెలిపారు.మిగిలిన వ్యక్తులు కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్నారు అని అన్నారు.