బిగ్ న్యూస్: వైసీపీ ను కెలికిన పవన్…ఘాటు విమర్శలు చేస్తున్న నేతలు!

Sunday, June 28th, 2020, 06:26:06 PM IST

పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. బీసీ రిజర్వేషన్ ల విషయం లో ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయ అని, తాజాగా వైసీపీ కూడా అదే బాటలో ఉంది అని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆనాడు కాపు సోదరులను నిలువుగా ముంచింది చంద్రబాబు అని, పవన్ ఆరోజు ఎందుకు గొంతెత్తి ప్రశ్నించలేదు అని నిలదీశారు. ముద్రగడ తో పాటుగా వారి కుటుంబాన్ని చిత్ర హింసలకు గురి చేస్తే, పవన్ ఆనాడు ఒక్క మాట అయినా మాట్లాడారా అని వ్యాఖ్యానించారు.అయితే పవన్ కళ్యాణ్ టీడీపీ ను అనకుండా వైసీపీ పై విమర్శలు చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆనాడు ప్రతి ఎడు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిన టీడీపీ, అయిదేళ్లలో కేవలం 1800 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని, ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు అని వ్యాఖ్యానించారు. అంతేకాక వంగవీటి రంగా ను హత్య చేయించిన పార్టీ తో పవన్ చేతులు కలిపాడు అని సంచలన ఆరోపణలు చేశారు.అయితే ఆ తర్వాత వారికి వైయస్ఆర్ అండగా నిలిచారు అని అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆనాడు చంద్రబాబు కాపుల్ని మోసం చేశాడు కాబట్టే ప్రజలు తగిన బుద్ది చెప్పారు అని వ్యాఖ్యానించారు.