బ్రేకింగ్: ORRపై ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం బోల్తా..!

Tuesday, July 7th, 2020, 01:11:01 PM IST

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఎస్కార్ట్ వాహనం పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌పై ప్రమాదానికి గురయ్యింది. గచ్చిబౌలి నుంచి మంత్రి బాలినేని విజయవాడకు వెళ్తుండగా ఆయన కాన్వాయ్ ముందున్న బొలేరో ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ కావడంతో రోడ్డుపై పల్టీలు కొడుతూ నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో హెడ్‌‌కానిస్టేబుల్ పాపయ్య మృతిచెందగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హయత్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనలో మంత్రి బాలినేనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.