లోకేష్ అలా చేస్తే అచ్చెన్న పరిస్థితి ఖాయం – మంత్రి బొత్స!

Wednesday, July 1st, 2020, 07:34:56 AM IST

తెలుగు దేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 200 కోట్ల రూపాయల తో అంబులెన్స్ లు కొంటె 307 కోట్ల కుంభకోణం అని అనడం విడ్డూరం గా ఉంది అని బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయం లో కూడా అన్ని విధాల సహాయం చేస్తుంది అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు అధికారం లో ఉండగా ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేకపోయారు అని అన్నారు. అంతేకాక వైయస్సార్ జయంతి నాడు పేదలకు 30 లక్షల ఇళ్ళ పట్టాలు పంపణీ చేసేందుకు సిద్ధంగా ఉంది అని తెలిపారు. పోలవరం ను బాబు ఏటీఎమ్ లా మార్చుకున్నారు అని విమర్శించారు. అయితే అచ్చెన్న అరె స్ట్ వ్యవహారం పై కూడా మంత్రి బొత్స సత్యనారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ ను అక్రమం అంటున్నారు, కానీ ఈ ఎస్ ఐ లో అవినీతి జరగలేదు అని ఎందుకు చెప్పడం లేదు అని నిలదీశారు. అయితే అచ్చెన్న లా లోకేష్ కూడా లెటర్స్ ఇచ్చి అదే పరిస్తితి పడుతుంది అని వ్యాఖ్యానించారు.

40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు, పరిశ్రమలకు ప్రోస్తహకలు చెల్లించనే లేదు అని సెటైర్స్ వేశారు. స్థానిక ఎన్నికల్లో భారీ రిజర్వేషన్ 63 శాతం ఇవ్వాలని జగన్ భావిస్తే, చంద్రబాబు తన మనుషులతో కోర్టు లో అడ్డుకున్నారు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గత అయిదేళ్ల పాలన విధానాన్ని జగన్ పాలిస్తున్న విధానాన్ని పోలుస్తూ చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేశారు.