మేం ఇంగ్లీష్ మీడియం కి కట్టుబడి ఉన్నాం – ఏపీ విద్యాశాఖ మంత్రి!

Friday, July 31st, 2020, 03:01:12 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి పలు విప్లవాత్మక మార్పులకి తెర లేపారు. అయితే ప్రభుత్వ పాటశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ను తీసుకొస్తాం అని పేదల జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం పై, పలు చర్యల పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యా విధానం లో చాలా అంశాలు సీఎం జగన్ అమలు చేస్తున్నావే అని అన్నారు.

అయితే ప్రభుత్వ రంగం లో మొదటిసారిగా ప్రి ప్రైమరీ విద్య ను తీసుకొస్తున్నాం అని అన్నారు. అయితే తాము ఇంగ్లీష్ మీడియం కి కట్టుబడి ఉన్నాం అని, తెలుగు ను ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయలేదు అని వ్యాఖ్యానించారు. తెలుగు మీడియం ఉండాలి అంటే ప్రైవేట్, ప్రభుత్వ పాటశాలల్లో అమలు చేయాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించారు. అయితే గత ప్రభుత్వం విద్యను వ్యాపార ధోరణితో చూసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తే, సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం పేదల హక్కుగా ఆకాంక్షించారు అని అన్నారు.