వాస్తవాలు తెలుసుకొని రాజకీయం చేయాలి – మంత్రి ఆదిమూలపు సురేష్

Thursday, April 22nd, 2021, 11:00:47 PM IST


కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారత్ లో ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలను సైతం ఈ మహమ్మారి భయాందోళనలకు గురి చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ నేపథ్యం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతి పక్ష పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పరిస్థితులకు అనుగుణంగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ పై నిర్ణయం తీసుకుంటాం అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలాపు సురేష్ అన్నారు.

అయితే ఈ పరీక్షల అంశం పై మరొకసారి సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు. అయితే విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత ను దృష్టిలో ఉంచుకొని తదుపరి నిర్ణయం తీసుకుంటాం అంటూ ఒక స్పష్టత ఇచ్చారు సురేష్. అయితే విద్యా సంవత్సరాన్ని కాపాడే ప్రయత్నాన్ని రాజకీయం చేసే రీతిలో నారా లోకేష్ వ్యాఖ్యలు సరైనవి కావు అని మంత్రి సురేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఆయన వాస్తవాలు తెలుసుకొని రాజకీయం చేయాలని హితవు పలికారు మంత్రి. అయితే ఇక్కడో హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఉన్న విద్యార్థుల భవిష్యత్ ను నిర్ణయించడం హాస్యాస్పదం అంటూ విమర్శించారు.