చంద్రబాబు వైఫల్యాల పై కథనాలు ప్రచురిస్తే బావుంటుంది – ఏపీ మంత్రి

Sunday, July 12th, 2020, 10:31:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదివారం నాడు జరిగిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయం లో రైతుల పట్ల సరైన విధానం పాటించలేదు అని తెలిపారు.అయితే రైతులకు నష్టం జరగడానికి చంద్రబాబే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అధికారం చేపట్టక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతులకు పలు విధాలుగా చేస్తున్న చర్యల పై వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమం కోసమే సీఎం జగన్ పని చేస్తున్నారు అని అన్నారు.

అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతుల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, కొన్ని పత్రికలు విచిత్ర కథనాలు రాస్తున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు పని తీరు పై ఘాటు విమర్శలు చేస్తూనే, అలా వార్తలు ప్రచురిస్తున్న ఈనాడు పత్రిక పై పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గత ప్రభుత్వ పాలన లో ఉన్న వైఫల్యాల పై ఈనాడు కథనాలు ప్రచురిస్తే బావుంటుంది అంటూ వ్యాఖ్యానించారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పోతుంది అని అన్నారు. రైతుల కి ఇచ్చిన హామీల పై వెనక్కి తగ్గకుండా నెరవేరుస్తూ పోతుంది అని రాష్ట్ర ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు.