ఏపీ మంత్రి కీలక ప్రకటన – రైతులందరికీ భరోసా

Tuesday, November 19th, 2019, 02:30:41 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నాడు నేడు కార్యక్రమాన్ని మిగతా శాఖల్లో కూడా ఏర్పాటు చేయడానికి ఆంద్రప్రదేశ్ మంత్రి నిర్ణయించుకున్నారు. కాగా ఏపీలో ప్రస్తుతానికి పాఠశాలలు, ఆసుపత్రుల్లో అమలు చేసిన విధంగానే మార్కెట్ యార్డుల్లో కూడా ఈ నాడు నేడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నామని ఏపీ వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు. కాగా ఈమేరకు డిసెంబర్ 15 వరకు కౌలు రైతు వివరాలు సేకరించి, అర్హులైనవారందరికి కూడా రైతు భరోసా పథకం కింద డబ్బులు అందజేయనున్నామని ఆయన వివరించారు.

కాగా ఇప్పటివరకు కూడా 45 లక్షల కుటుంబాలు రైతు భరోసా పథకం ద్వారా లబ్ది పొందుతున్నాయని మంత్రి కన్నబాబు ప్రకటించారు. కాగా ఇకపోతే సన్నకారు రైతులు పండించే చిరు దాన్యాలకు కూడా మద్దతు ధర ప్రకటించాలని, వారందరికీ కూడా సమన్యాయం చేయాలనీ సీఎం జగన్ ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేశారని మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఇకపోతే ప్రతి నియోజవర్గానికి మార్కెట్ కమిటీ ఉండేలా ఏర్పాట్లు చేస్తామని, దానితో పాటే రాష్ట్రంలో మరిన్ని కొత్త మార్కెట్ కమిటీలు రానున్నాయని, ఇకనుండి రైతులందరికీ కూడా లాభం చేకూరుతుందని మంత్రి కన్నబాబు తెలిపారు.