కరోనా నియంత్రణకు లాక్ డౌన్ పరిష్కారం కాదు – మంత్రి కొడాలి నాని

Monday, April 19th, 2021, 05:10:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలు అంశాల పై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఈ మేరకు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో దొంగ ఓట్లు పడ్డాయి అంటూ వస్తున్న ఆరోపణల పై సమాధానం ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు పడలేదు అంటూ మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. పోలింగ్ 50 శాతమే అంటూ వెల్లడించారు. అయితే చంద్రబాబు చెప్పినట్లుగా బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసి ఉంటే పోలింగ్ 80 శాతం, 90 శాతం ఉండేది అంటూ చెప్పుకొచ్చారు.కానీ అలా ఏమి జరగలేదు అంటూ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులు సైతం ఈ మహమ్మారి భారిన పడి పలువురు ప్రాణాలను కోల్పోయారు.

అయితే ఈ అంశం పై స్పందించిన కొడాలి నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ పరిష్కారం కాదు అని వ్యాఖ్యానించారు. అయితే ప్రజలు మాస్కులు ధరించి శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించి అప్రమత్తంగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ లో వైసీపీ దృష్టి పెట్టలేదు అని, అయితే వైఎస్ షర్మిల పెట్టబోతున్న పార్టీ పై ఏమీ చెప్పలేను అంటూ వ్యాఖ్యానించారు. అయితే మంత్రి కొడాలి నాని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో దొంగ ఓట్ల ప్రస్తావన పై నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.