టీడీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు – ఏపీ మంత్రి సంచలనం

Wednesday, August 14th, 2019, 02:04:16 AM IST

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి. రోజురోజుకి పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి… ఈమేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కొన్ని సంచలన వాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారందరు కూడా ఇప్పటికే సంప్రదింపులు జరిపారని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడంటే అప్పుడే ఆ టీడీపీ నేతలందరూ కూడా రాడానికి సిద్ధంగా ఉన్నారని అవంతి తెలిపారు. కాగా జగన్మోహన్ రెడ్డి ఫిరాయింపులకు అడ్డు చెప్పడంతోనే, ప్రస్తుతానికి వారందరు కూడా పార్టీలోకి రాడానికి కాస్త ఆలోచిస్తున్నారని అవంతి శ్రీనివాస్ ఇలాగ సంచలన వాఖ్యలు చేశారు.

ఇకపోతే ఇకపోతే ఏపీలోని తొలి అసెంబ్లీ సమావేశాల సమయంలో నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్‌రెడ్డి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని తానే స్వయంగా చెప్పుకొచ్చారు. కాగా ఈసమయంలో అవంతి శ్రీనివాస్ చేసిన వాఖ్యలు మళ్ళీ కలకలం సృష్టిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచిపెట్టుకపోతుందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ పార్టీ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. కాగా టీడీపీ నుండి వైసీపీ వైపు చూసే నేతలెవరూ అని టీడీపీ నేతలందరూ కూడా చర్చలు ముమ్మరం చేశారని సమాచారం.