వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు – నిజమేనా…?

Friday, August 23rd, 2019, 02:10:29 AM IST

గురువారం నాడు విశాఖ లో నిర్వహించిన మీడియా సమావేశనికి హాజరైన ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ నేడు కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గనక ఒప్పుకుంటే టీడీపీ పార్టీ నుండి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని అవంతి శ్రీనివాస్ అన్నారు. కానీ పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరనేది మాత్రం బయటకు చెప్పలేదు. జగన్ సరిగ్గా ద్రుష్టి పెడితే మాత్రం ఏపీలో టీడీపీ అంత కూడా ఖాళీ అవుతుందని, కానీ కొన్ని సమీకరణాల వలన జగన్ అంతటి దారుణానికి ఒడిగట్టడం లేదని అవంతి తెలిపారు.కాగా అంతేకాకుండా వరదనీటి విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చాల దారుణంగా మాట్లాడుతున్నారని, కానీ ఆ విషయంలో కాస్త హుందాగా వ్యవహరిస్తే అందరికి కూడా మంచిదని, లేకపోతె తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదని అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఎన్నికల తరువాత టీడీపీ ని వదిలి బీజేపీ లో చేరినటువంటి మాజీ టీడీపీ నేత సుజనా చౌదరి పై కూడా అవంతి తనదైన రీతిలో విమర్శలు చేశారు. బీజేపీలో చేరిన సుజనా చౌదరి టీడీపీ పాట పాడుతున్నారని, ఇదంతా కూడా చంద్రబాబు ప్లాన్ లాగే అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. సుజనా చౌదరి ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారనేది తెలుసుకోవాలని హితవు పలికారు. ఇకపోతే రాజధానిని మార్చడంపై పలు వార్తలు వస్తున్నాయని టీడీపీ నేతలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ అదే నిజమైతే గనక ప్రభుత్వం అధికారికంగానే ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.