అది వట్టి బోగస్ దీక్ష – ఏపీ మంత్రి సంచలన వాఖ్యలు

Tuesday, November 12th, 2019, 12:31:55 AM IST

సోమవారం నాడు అనంతపురం జిల్లా అభివృద్ధి పై జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మొదటిసారిగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆతరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి బొత్స, టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్రమైన విమర్శలు చేశారు. కాగా రాష్ట్రంలో వరదల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇసుక రవాణా సరిగా జరగడం లేదని అందరికి తెలుసు. కానీ ఈ విషయాన్ని కుట్ర పూరితమైన ధోరణిలో చూస్తూ, ప్రజలందరినీ మభ్య పెడుతూ, ప్రభుత్వం పై వ్యతిరేక భావనని కలగజేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పై మండిపడ్డారు.

అంతేకాకుండా రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని, అంతే కానీ ప్రజల పట్ల ఎలాంటి ప్రేమాభిమానాలు ఉండవని, రాజకీయంగా మళ్ళీ పాత పగలు, కుట్రలు, అవినీతిని అన్నింటిని రాజేయాలని బోగస్ దీక్ష చేపడుతున్నారని చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే చంద్రబాబు మళ్ళీ బీజేపీ తో దోస్తీ కట్టడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకనే ఇలా కొత్తగా తన దీక్షకు మద్దతు కోరుతున్నది మంత్రి వివరించారు.