పక్కా ఇళ్ల విషయంలో ఏపీ మంత్రి కీలక ప్రకటన…

Wednesday, February 19th, 2020, 02:41:15 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్య నారాయణ నేడు పక్కా ఇళ్ల విషయంలో కిన్ని కీలకమైన ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో నిరుపేదలైన, అర్హులందరికీ కూడా పక్కా ఇల్లు కట్టిస్తామని, అందుకు గాను పక్కా ప్రణాళికలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి బొత్స వాఖ్యానించారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన మున్సిపల్ కమీషనర్‌లతో రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాగా ఈ సమావేశంలో అర్హులైన నిరుపేదలందరికీ కూడా ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అంతేకాకుండా ఇదివరకు గుర్తించిన వారిలో కొన్ని అవకతవకలు జరిగాయని, వారిని తక్షణమే సంబంధిత జాబితా నుండి తొలగించాలని మంత్రి బొత్స సత్య నారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇకపోతే గ్రామ వాలంటీర్లు అందరు కూడా అన్ని గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి మరీ సర్వే చేసి ప్రభుత్వ విధి విధానాల ప్రకారం అర్హులైన వారికే పక్కా ఇళ్లను మంజూరు చేయాలనీ పలు ఆదేశాలు జారీ చేశారు.