రాజధాని విషయంలో ఏపీ మంత్రి సంచలన వాఖ్యలు

Friday, August 23rd, 2019, 03:00:18 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి మార్చడానికి వైసీపీ ప్రభుత్వం చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేతలందరూ కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే… కాగా ఈ టీడీపీ నేతల విమర్శలపై స్పందించిన ఏపీ మంత్రి కొడాలి నాని కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం ఎక్కడ కూడా తప్పుబట్టలేదని, కేవలం టెండరింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయమని మాత్రమే ఒక సలహా రూపంలో చెప్పిందని మంత్రి కోడలి నాని వాఖ్యానించారు. ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి, దోపిడీని అరికట్టేందుకే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను తెరమీదకు తెచ్చారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

కాగా ఎవరెన్ని కుట్రపూరితంగా రాజకీయాలు చేసినప్పటికి కూడా పోలవరం విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు వెనక్కి తగ్గవని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇకపోతే ఈ పోలవరం విషయంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని కొడాలి నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.కోట్లు దోచుకున్నారని, ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఈ రివర్స్ టెండరింగ్ వలన తమ అక్రమాలు బయటపడతాయని టీడీపీ నేతలు భయపడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఇకపోతే రాజధాని అమరావతిని మార్చే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదని, ఒకవేళ నిజంగానే మార్చాల్సి వస్తే మాత్రం టీడీపీ నేతలు ఎవరైనా ఆపగలరా అని వైసీపీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.