ఏపీ మంత్రి సంచలన వాఖ్యలు – పార్టీ మారనికి 50 కోట్లా…?

Tuesday, June 18th, 2019, 01:00:33 AM IST

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ అనే కొత్త ప్లాన్ వేసి వైసీపీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుందని, అందుకు గాను నగదు, కాంట్రాక్టులను కూడా అప్పగించే ప్రయత్నం చేశారని చాలా ఆరోపణలు వినిపించాయి… అసలు వైసీపీ ని పూర్తిగా ఏపీలో నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీ లు టీడీపీలో చేరిన విషయం తెల్సిందే. అయితే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తనకు ఆనాడు 50 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని, మంత్రి పదవి ఇవ్వజూపారని, ప్రస్తుత ఏపీ మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల్లో ఆలూరు నుండి పోటీ చేసిన జయరాం ను టీడీపీ లోకి లాక్కోడానికి ప్రయత్నించారని, అందుకు తనకు 50 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారని చెప్పారు. అంతేకాకుండా మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పారని జయరాం అన్నారు. అందుకు ఒక వ్యక్తి ని మధ్యవర్తిగా పంపారని చెప్పారు. వారు ఎన్ని చెప్పిన కూడా తానూ వినలేదని, ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ లోనే ఉంటానని, వైసీపీ ని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసానని జయరాం అన్నారు… ఇంతవరకు అంత బాగానే ఉన్నా జయరాం ఇపుడెందుకు ఇలా అంటున్నారని ఆలోచించగా, ఇపుడు తాము అధికారంలో ఉన్నామని, చంద్రబాబుల నీటి మళ్ళిన రాజకీయాలు తాము చేయబోమని చెప్పారు.