అప్పుడు తప్పు కానిది, ఇప్పుడెలా తప్పు అవుతుంది – ఆగ్రహించిన ఏపీ మంత్రి

Wednesday, November 20th, 2019, 07:45:11 AM IST

గత కొద్దీ కాలంగా ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అన్ని కూడా అధికార పార్టీ పై తీవ్రమైన విమర్శలు చేస్తూనే ఉంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొన్ని పథకాలే… అయితే ఈ పథకాలు నచ్చని కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే… ఇటీవల టీడీపీ పార్టీ నుండి బయటకు వచ్చినటువంటి వంశీ, తాను అయ్యప్ప మాలలో ఉండి కూడా టీడీపీ నేతలపై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు.

కాగా ఒక పవిత్రమైన దీక్షలో ఉండి కూడా వంశీ అలా మాట్లాడటం అనేది హిందూ ధర్మ శాస్త్రాన్ని కించపరిచేలా ఉన్నాయని టీడీపీ తీవ్ర విమర్శలు చేపట్టింది. ఈ దెబ్బతో వైసీపీ నేతలందరినీ కూడా తప్పుబడుతున్నారు… ఇకపోతే మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం అయ్యప్ప దీక్షలో ఉండి చెప్పుులు వేసుకున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. కాగా ఈ విమర్శలపై మంత్రి అవంతి స్పందిస్తూ… నేను హిందూ మతంలోనే పుట్టాను, హిందూ మతంలోనే చనిపోతానని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఇకపోతే తనకు మధుమేహ వ్యాధి ఉన్నందువల్లే తాను ఇప్పటికి చెప్పులు దరిస్తున్నానని చెప్పుకొచ్చారు. కాగా నేను గతంలో టీడీపీ లో ఉన్నప్పుడు కూడా ఇలాగె మాల వేసుకొని చెప్పులు ధరించానని, కానీ అప్పుడు తప్పు కానిది, ఇప్పుడెలా తప్పుబడుతున్నారని టీడీపీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు.