వారి పై పవన్ కపట ప్రేమ చూపుతున్నారు – ఏపి మంత్రి

Thursday, May 21st, 2020, 05:41:40 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన పై మరోమారు ప్రశంసలు కురిపిస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అయితే ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల పై ఘాటు విమర్శలు చేశారు. అయిపోయిన పెళ్లికి బాజా కొట్టకు పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఇప్పటికే పురోహితులకు లాక్ డౌన్ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ సాయం ప్రకటించిన తర్వాత పవన్ పురోహితులను ఆదుకోవాలి అని వ్యాఖ్యానించడం పై సెటైర్స్ వేశారు.

పవన్ కళ్యాణ్ పురోహితుల పై కపట ప్రేమ చూపుతున్నారు అని మంత్రి విమర్శించారు. ఇదివరకే సాయి ప్రకటించాక మళ్లీ మీ డిమాండ్ ఏంటండీ అంటూ పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలా చేయడం కామెడీ అంటూ వ్యాఖ్యానించారు.హైదరాబాద్ లో ఉండుట వలన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు కనిపించడం లేదు ఏమో అంటూ ఎద్దేవా చేశారు. అయితే పవన్ కళ్యాణ్ లక్షల పుస్తకాలు చదివి ఉన్న మతి పోయినట్లు ఉంది అని అన్నారు.

అయితే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ టైమ్ చేస్తున్నారు అని అన్నారు. నిద్ర లేచిన తర్వాత నిజాలు తెలుసుకొని మాట్లాడండి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక బ్రాహ్మణులకు వైసీపీ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. ఈ నెల 19 న జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు సంబంధించిన క్యాలెండర్ విడుదల చేశారని, అందులో మే 26 న అర్చకులకు ఆర్ధిక సహాయం చేస్తున్న విషయం ఉంది అని అన్నారు.