సీఎం జగన్ బాహుబలి.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..!

Friday, June 26th, 2020, 11:10:13 PM IST

ఏపీ సీఎం జగన్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే సీఎం జగన్ బాహుబలి అని అన్నారు. అయితే జగన్ పాలనపై విమర్శిస్తున్న నేతలంతా కాలకేయులు అని అన్నారు.

అయితే భార్యకు భర్త మెసేజ్ పెట్టాలన్నా జగన్ పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నిస్తున్న లోకేశ్ కామెంట్స్‌కు అసలు అర్ధమే లేదని అన్నారు. అంతేకాదు లోకేశ్‌ను టీడీపీ నేతలు పరామర్శించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. అచ్చెన్నను హత్య చేయాలని ప్రభుత్వం చూస్తుందంటూ అర్థంలేని కామెంట్లు చేస్తున్నారని, హత్యలు చేసే సంస్కృతి టీడీపీదే అని వంగవీటి రంగాను నడిరోడ్డుపై చంపింది ఎవరో అందరికీ తెలుసని విమర్శించారు.