ఏపీ ప్రజల్లో జగన్ పై అప్పుడే వ్యతిరేఖత మొదలయ్యిందా.?

Sunday, June 2nd, 2019, 04:00:52 AM IST

జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకున్న అభిమానుల కోరిక ఎన్నో ఏళ్ల తర్వాత 2019 సంవత్సరంతో నెరవేరింది.దీనితో ముఖ్యమంత్రి పదవిని జగన్ చాలా బాధ్యతాయుతంగా స్వీకరించి తాను కేవలం ఒక్క ఏడాదిలోపే మంచి సీఎం గా పేరు తెచ్చుకుంటానని చాలా విశ్వాసంగా చెప్తున్నారు.దీనితో సదరు వైసీపీ మరియు జగన్ అభిమానులు రానున్న ఐదేళ్లు జగన్ పరిపాలన ఎలా ఉండబోతుందా అని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటుండగా సామాన్య ఏపీ ప్రజలు మాత్రం జగన్ పై ఇప్పటి నుంచే తిరగబడుతున్నారు.

జగన్ ఇచ్చిన హామీలుతో తమని మోసం చేసారని అంటున్నారు.ఇంతకీ వారెవరో కాదు పింఛనులు అందుకునే వృద్ధ ఓటర్లు.జగన్ తన పాదయాత్ర సమయంలో వీరికి ఎంతటి ఆదరణ అందించారో అందరికీ తెలుసు.అంతే కాకుండా వారి నుంచి జగన్ కూడా అంతే స్థాయిలో ఆశీర్వాదం అందుకున్నారు.ఆ సమయంలోనే తాను వృద్దులకు అధికారంలోకి వచ్చిన పిమ్మట 2000 రూపాయలు పింఛను ఇస్తానని తెలిపారు.కానీ సరిగ్గా ఎన్నికల ముందే ఈపథకాన్ని చంద్రబాబు అమలు చేసెయ్యడంతో దాన్ని జగన్ 3000 రూపాయలకి పెంచేశారు.

దీనితో జగన్ కు వృద్ధ ఓటర్ల నుంచి భారీ స్థాయిలోనే ఓట్లు పడ్డాయి.కానీ మొన్న ప్రమాణ స్వీకారం రోజున జగన్ చేసిన ప్రకటనతో ఇప్పుడు వారు జగన్నే తిట్టి పోస్తున్నారు.ముందు 3 వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు మూడు దశల్లో పెంచుతానని చెప్పి తమని మోసం చేసారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనితో ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా జగన్ మాట మార్చడం వల్ల ఇప్పటి నుంచే వ్యతిరేఖత మొదలయ్యింది అని వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.