సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ను అరెస్ట్ చేసిన పోలీసులు!

Tuesday, May 11th, 2021, 02:14:07 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తిరుపతి రుయా ఆసుపత్రి లో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పట్ల సీపీఐ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టింది. ప్రాణాలు పోవడానికి బాధ్యులు అయిన వారి పై చర్యలు తీసుకోవాలని, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలి అంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే సీపీఐ శ్రేణులు ర్యాలీ గా ఆసుపత్రి కి చేరుకోవడం జరిగింది. అయితే సీపీఐ నేతలు తలపెట్టిన ఈ ఆందోళన కి నిరశన తెలిపేందుకు వస్తున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. నగరి సమీపంలో ఆయనను అరెస్ట్ చేయగా, స్వగ్రామం అయిన ఐనం బాకంకి తరలించడం జరిగింది. అయితే రుయాం ఘటన పట్ల ప్రతి పక్ష పార్టీ నేతలు అధికార పార్టీ వైసీపీ పై భగ్గు మంటున్నారు. అధికార పార్టీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.