బ్రేకింగ్: మరో టీడీపీ నేత అరెస్ట్.. షాక్‌లో చంద్రబాబు..!

Monday, October 21st, 2019, 05:59:38 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు చేసిన అక్రమాలను, దోపీడీలను ఆధారాలతో సహా వెలికితీస్తూ వైసీపీ ప్రభుత్వం వారిపై కేసులు నమోదు చేయిస్తుంది. అయితే ఇప్పటికే చింతమనేని, యరపతినేని, కూన రవికుమార్ వంటి పలువురు నేతలపై కేసులు పెట్టి జైళ్ళకు పంపిన సంగతి తెలిసిందే.

అయితే రెండు రోజుల క్రితం గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నిన్న ఒక ఫ్రాడ్ కేసు నమోదయ్యింది. అయితే తాజాగా మరో టీడీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్‌ తిక్కారెడ్డి భాగస్వామిగా ఉన్న పరిశ్రమకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.12 కోట్లు బకాయి చెల్లించలేదని ఆయ్న పార్ట్‌నర్ పోలీస్ కేసు పెట్టారు. అయితే ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు తిక్కారెడ్డిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే కావాలనే అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తూ తిక్కారెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.