స్పీక‌ర్ కోడెల‌పై కోడ‌లు వీడియో ఎటాక్‌?

Saturday, February 11th, 2017, 09:00:08 PM IST


మహిళా పార్ల‌మెంటేరియ‌న్ స‌ద‌స్సు .. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో మార్మోగిపోతున్న హాట్ టాపిక్ ఇది. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల సాధికారిత‌, అధికారం వ‌గైరా వ‌గైరా అంశాల‌పై ఇప్ప‌టికే టీవీల్లో ఒక‌టే లైవ్ డిష్క‌స‌న్‌. స‌రిగ్గా ఇదే అద‌నుగా ఓ వీడియో స‌మాజిక మాధ్య‌మాల్లో, మీడియా గ్రూపుల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ వీడియో ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన‌వారంతా ఔరా.. స్పీక‌ర్ కోడెల ఇంట ఇంత పెద్ద వివాదం ఉంది క‌దా? ఆయ‌న ఇప్పుడు మ‌హిళ‌ల త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకుని ఏకంగా వాళ్ల‌తో పార్ల‌మెంటేరియ‌న్ స‌ద‌స్సు నిర్వ‌హిస్తారా? అంటూ ఒక‌టే డిష్క‌స‌న్ న‌డుస్తోంది. ఏ న‌లుగురు గుమిగూడినా ఇదే విష‌యం ముచ్చ‌టించుకుంటున్నారు. అస‌లింత‌కీ ఆ వీడియోలో ఏం ఉంది? అంటే కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కోడ‌లు త‌న‌పై అత్త‌-మామ‌లు హ‌రాస్ చేస్తున్నారంటూ ఆరోపించింది. రౌడీల‌తో కొట్టించ‌డ‌మే కాదు, పోలీసులు సైతం త‌న‌ని హింసించార‌ని, నానా దుర్భాష‌లాడార‌ని ఆరోపించింది. పెళ్ల‌యిన‌ప్ప‌టినుంచే హ‌రాస్‌మెంట్ స్టార్ట్ చేశారు. పిల్లాడు పుట్టాక అది మ‌రింత పెరిగింది అంటూ ఏడుస్తూ వీడియోలో నివేదించారు ఆమె.

నా పేరు ప‌ద్మ‌ప్రియ .. ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కోడ‌లిని. 2009లో వార‌బ్బాయి శివ‌రామ‌కృష్ణ‌తో వివాహం అయ్యింది. 2010లో బాబు పుట్టాడు. అప్ప‌టినుంచి మ‌రింత ఎక్కువైంది. ప‌వ‌ర్ వ‌చ్చాక వేదింపులు ఇంకా ఎక్కువయ్యాయి. చంపేస్తానంటూ రోజూ బెదిరింపులు వ‌చ్చినా అడిగేవారే లేరు. ప‌దిమంది రౌడీల‌తో వ‌చ్చి రాత్రి 10 గంట‌ల‌కు మా ఇంటిపై దాడి చేశారు. .. అంటూ ఏడుస్తూ చెప్ప‌డం ఈ వీడియోలో క‌నిపిస్తోంది.
స‌ద‌రు స్పీక‌ర్ ప‌వ‌ర్‌ని అడ్డు పెట్టుకుని .. ఆడుకుంటున్నారు. నా బిడ్డ‌ను ఏం చేశారో కూడా తెలీదు. ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులే న‌న్ను నానా న‌ర‌కానికి గురి చేస్తున్నారు.. మీడియాని కంట్రోల్ చేశారు.. అంటూ ఆ ఆడ‌బిడ్డ కంట‌త‌డి పెట్ట‌డం ఈ వీడియోలో క‌నిపిస్తోంది. దొంగ కేసులు భ‌నాయించి ఏదో చేస్తారేమో అన్న భ‌యంగా ఉందంటూ చెప్ప‌డం ఈ వీడియోలో క‌నిపించింది. అయితే తాను శివ‌రామ‌కృష్ణ‌కు రెండో భార్య‌న‌ని , మొద‌టి భార్య విడాకులిచ్చాకే పెళ్లి చేసుకున్నాన‌ని చెబుతున్నారు ప‌ద్మ‌ప్రియ‌.