పార్టీ నచ్చక పోతే రాజీనామా చేసి వెళ్లిపోవచ్చు – తమ్మినేని సీతారాం!

Sunday, July 5th, 2020, 07:11:50 PM IST

వైసీపీ నేత, ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. పార్టీ పై, అధిష్టానం పై చేసిన వ్యాఖ్యల విషయమై ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎంపీలు స్పీకర్ ను కలిసి వంద పేజీల లేఖను అందించి పార్టీకి రఘురామ కృష్ణంరాజు అనర్హుడు అని ప్రకటించాలి అని కోరడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పై రఘురామ కృష్ణంరాజు సైతం హైకోర్టు ను ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పై తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సభాపతి తమ్మినేని సీతారాం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రఘురామ కృష్ణంరాజు ఉద్దేశ్య పూర్వకంగా నే రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు అని తమ్మినేని సీతారాం ఆరోపించారు. అంతేకాక పార్టీ నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. అయితే తమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకూ కేవలం కొందరు మాత్రం స్పందించారు. అయితే ఇపుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించడం తో ఈ వ్యవహారం మరింత వివాదం గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై రఘురామ కృష్ణంరాజు ఎలా స్పందిస్తారు అనేది ఇపుడు చర్చంశనీయం గా మారింది.